ధరలు పెంచితే జైలుకే : కొడాలి నాని
గుడివాడ, మార్చి 23
ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. అలాంటి వ్యాపారులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే జైలుకు పంపుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరిస్తే వారికి, దేశానికి మంచిదని కొడాలి నాని పేర్కొన్నారు.పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని జగన్ అదేశాలతో ఈనెల 29వ తేదీన రేషన్ సరకులు అందజేస్తామన్నారు. తెల్ల కార్డు కలిగిన వారికి ఉచితంగా రేషన్ సరకులతో పాటు కేజీ కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. తెల్ల కార్డు కలిగిన పేద ప్రజలకు నిత్యావసర ఖర్చుల నిమిత్తం ఏప్రిల్ 4వ తేదీన వాలంటీర్లు ద్వారా ఇంటికి రూ.1000 పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి తెలిపారు.