YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

. చైనాలో 89 శాతం మంది కోలుకుంటున్నారు

. చైనాలో 89 శాతం మంది కోలుకుంటున్నారు

. చైనాలో 89 శాతం మంది కోలుకుంటున్నారు
బీజింగ్, మార్చి 23
చైనా కరోనా వైరస్ నిర్ధారణ అయినవారిలో 89 శాతం కోలుకున్నట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సోమవారం వెల్లడించింది. గతేడాది డిసెంబరు చివరి వారం నుంచి మొత్తం 81,093 కేసులు నమోదయ్యాయని, వీరిలో 72,703 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని పేర్కొంది. కేవలం 5,120 మంది మాత్రమే హాస్పిటల్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపింది. చైనాలోని 31 ప్రావిన్సులు, జియాంగ్ ప్రొడక్షన్, కన్‌స్ట్రక్షన్ కార్ప్స్‌లో మార్చి 22 అర్ధరాత్రి 12 గంటల వరకు మొత్తం 81,093 కేసులు నిర్ధారణ కాగా, 3,270 మంది మృతి చెందినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది.ఇప్పటి వరకు 72,703 మంది బాధితులు కోలుకోవడంతో హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వివరించింది. ఇంకా, 5,120 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతుండగా వీరిలో 1,749 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉందని తెలిపింది. మరో 136 అనుమానిత కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇక, కరోనా వైరస్ మహమ్మారి తొలిసారిగా వెలుగుచూసిన హుబే ప్రావిన్సుల్లో ఆదివారం ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం విశేషం.ఈ ప్రావిన్సుల్లోని మొత్తం 447 మందిని హాస్పిటల్స్ నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేయగా, ఒక్క వుహాన్ నగరంలోనే 434 మందిని ఇళ్లకు పంపారు. చైనాలో ఆదివారం 39 కేసులు నమోదు కాగా, వీరంతా విదేశాల నుంచి వచ్చిన చైనా పౌరులేనని తెలిపింది. బీజింగ్‌లో 10, షాంఘైలో 13 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజుల నుంచి కొత్తగా వైరస్ బారినపడ్డ స్థానికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు చైనా తెలిపిందికానీ, ఆదివారం నాడు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక పౌరులు వైరస్‌ బారినపడినట్టు తెలుస్తోంది. శుక్రవారం 41 కేసులు నమోదు కాగా, వీరంతా విదేశాల నుంచి వచ్చిన చైనా పౌరులే. సదరన్ ప్రావిన్సుల్లోని గ్వాంగ్జూ‌లో తొలి కేసు శనివారం నమోదయ్యింది. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ 19 నిర్ధారణ కాగా.. అతడి నుంచి మరో వ్యక్తికి వైరస్ సోకింది. వైరస్‌ను నిరోధించడానికి చైనా అత్యంత కఠినమైన చర్యలు చేపట్టింది.

Related Posts