YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

17వేలకు చేరిన కరోనా మృతులు

17వేలకు చేరిన కరోనా మృతులు

17వేలకు చేరిన కరోనా మృతులు
న్యూఢిల్లీ, మార్చి 24
నాలో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా 197 దేశాలకు వ్యాప్తిచెందింది. అన్ని దేశాల్లోనూ విజృంభిస్తోన్న ఈ మహమ్మారి ఇప్పటికే వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. దీనికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ సతమతవుతున్నాయి. లాక్‌డౌన్‌లు పాటిస్తూ వైరస్ తీవ్రత మాత్రం పెరుగుతూ ఉంది కానీ, తగ్గుముఖం పట్టడంలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం లాక్‌డౌన్‌ల వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. చైనాలో కోవిడ్-19 తగ్గుముఖం పట్టినా మిగతా దేశాల్లో మాత్రం ఉద్ధృతంగా ఉంది.ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 16,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3.76 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 మంది మృతిచెందారంటే మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు, వైరస్ బారినపడ్డవారిలో 1.02 లక్షల మంది కోలుకోగా, 2.60 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 2.48 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 12,500 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. 118,583 కేసులను మూసివేశారు.ఐరోపాలో ఏకంగా 10,000 మంది మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా ఇటలీ కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 600 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 4,789 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా మరణాల సంఖ్య ఇటలీలో 6,077కు చేరుకోగా, బాధితుల సంఖ్య 64,000 చేరింది. కోవిడ్ విషయంలో ఇటలీ చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు భారీమూల్యం చెల్లించుకుంటోంది. ఆరు కోట్ల మంది జనాభా కలిగిన ఈ దేశం ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తర ఇటలీలోని లొంబార్డోలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.వైరస్‌కు మూల కేంద్రమైన చైనాలో గత ఐదు రోజుల కంటే సోమవారం కొత్త కేసులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం కొత్తగా 78 కేసులు నమోదు కాగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 3,277కు చేరింది. తమ దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని చైనా పేర్కొంటోంది. స్థానికుల్లో ఎక్కడా వైరస్ కేసులు నమోదుకాలేదని చెబుతోంది. చైనా ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అమెరికాలోనూ వైరస్ తీవ్రత రోజు రోజుకూ అధికమవుతోంది. అక్కడ మరణాల సంఖ్య 553 చేరుకోవడమే దీనికి నిదర్శనం. సోమవారం ఏకంగా 140 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్త కేసులు 10,168 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 43,734కు చేరింది. పలు రాష్ట్రాలను ఇప్పటికే లాక్‌డౌన్ చేసిన అమెరికా.. న్యూయార్క్ నగరాన్ని సైతం సోమవారం షట్‌డౌన్ చేసింది. దాదాపు 8.5 మిలియన్ల జనాభా కలిగిన న్యూయార్క్ నగరంలో వైరస్‌కు మరో కేంద్రం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.సోమవారం స్పెయిన్‌లో 539 (2,311), ఇరాన్‌లో 127 (1,812), ఫ్రాన్స్‌లో 186 (860), బ్రిటన్‌లో 54 (335) మంది మృతిచెందారు. దక్షిణ కొరియాలో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఆ దేశం తీసుకున్న చర్యల సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 111 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు సోమవారం కేవలం 64 మాత్రమే బయటపడగా.. మొత్తం 8,911 మంది వైరస్ బారినపడ్డారు. ఫ్రాన్స్‌లో 19,856 మంది, జర్మనీలో 29,056 మంది, స్విట్జర్లాండ్‌లో 8,795 మంది, బ్రిటన్‌లో 6,650 మంది వైరస్ బారినపడ్డారు. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోనూ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. సోమవారం మరో 99 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 875కి చేరింది.

Related Posts