YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రెండింతలైన కూరగాయాలు

రెండింతలైన కూరగాయాలు

రెండింతలైన కూరగాయాలు
హైద్రాబాద్, మార్చి 24
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌తో కూరగాయల ధరలు ఒక్కరోజులోనే మూడింతలయ్యాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. సోమవారం నగరంలోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు 46 శాతం కూరగాయల సరఫరా తగ్గింది. దీంతో పాటు గుడి మల్కాపూర్‌ మార్కెట్‌ శుభ్ర పర్చడానికి సోమవారం మూసివేశారు. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రూ.60 నుంచి రూ.80 మధ్య పలికాయి. జనతా కర్ఫ్యూ, నగర లాక్‌డౌన్‌కు ముందు కిలో రూ.10 పలికిన టమాటా సోమవారం రూ.80కి విక్రయించారు. అత్యధికంగా చిక్కుడు, బిన్సీస్‌ ధర రూ. 100 నుంచి రూ.120 వరకు బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు విక్రయించారు. కరోనా ప్రభావంతో నగర జనం ఎక్కువ శాతం కూరగాయలను వినియోగిస్తున్నారు. దీంతో కూడా మామూలు రోజుల కంటే ఎక్కువగా కూరగాయలు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నెల 31 వరకు నగరం లాక్‌డౌన్‌తో కూడా నగర ప్రజలు అర కిలో, కిలో చోటా నాలుగు, ఐదు కిలో వివిధ రకాల కూరగాయలు కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. దీంతోనూ దిగుమతి అయినా కూరగాయలు సరిపోకపోవడంతో వ్యాపారులు ధరలు ఒకేసారి పెంచేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర జనాహి దాదాపు కోటి మంది. వీరు ప్రతిరోజు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగిస్తుంటారు. ప్రతిఒక్కరికీ 300 గ్రాముల కూరగాయలు అవసరం. కరోనా ప్రభావంతో నగర జనం నాన్‌వెజ్‌కు దూరమయ్యారు. దీంతో ప్రస్తుతం నిత్యం  4 వేల టన్నుల కూరగాయలు విక్రయాలు జరుగుతున్నాయని మార్కెటింగ్‌ శాఖ అధికారుల అంచనా. కానీ మార్కెట్‌లకు డిమాండ్‌కు తగ్గ కూరగాయలు సప్లయ్‌ లేకపోడంతో కూరగాయల కొరత నెలకొందని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. సోమవారం బోయిన్‌పల్లి మార్కెట్‌కు దాదాపు 745 టన్నులు, ఎల్బీనగర్‌ మార్కెట్‌కు 11, మాదన్నపేట్‌ మార్కెట్‌కు 8, మీరాలంమండి మార్కెట్‌కు 6 టన్నుల కూరగాయలు దిగుమతి అయ్యాయి. దీంతో పాటు నగరంలోని 11 రైతు బజార్లను కలుపుకొని 110 టన్నులు, ఇతల చిన్నాచితకా మార్కెట్‌లకు 10 టన్నుల కూరగాయలు దిగుమతి అయినట్లు అంచనా. గ్రేటర్‌ కూరగాయల అవసరం ఒక్క రోజుకు 3 వేల నుంచి నాలుగు వేల టన్ను అయితే సోమవారం కేవలం వెయ్యి టన్ను కూరగాయలు దిగుమతి అయ్యాయి. దీంతో డిమాండ్‌ ఎక్కువ.. సప్లయ్‌ తక్కువ కావడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.

Related Posts