. కరోనా ఎఫెక్ట్.. ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం
ఆదిలాబాద్ మార్చి 24
కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇచ్చోడ మండలం అడేగాం(బి) గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు మద్ధతుగా గ్రామస్తులు ఎవరూ బయటకు వెళ్ళొద్దని, బయట వాళ్లు ఎవరూ గ్రామంలోకి రావొద్దని తీర్మానం చేశారు. గ్రామానికి వచ్చే అన్ని దారులను మూసివేశారు. బయటి నుంచి ఎవరూ తమ గ్రామంలోకి రావొద్దంటూ ప్లెక్సీలు పెట్టారు. దాంతోపాటు గ్రామస్తులు అంతా స్వీయ నిర్భందం విదించుకున్నారు. నిత్యావసర వస్తువుల కొరత తీర్చుకునేందుకు వస్తు మార్పిడి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇదిలా ఉండగా, కరోనా వ్యాపించొద్దని ఇచ్చోడలో ప్రజలంతా గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి బోనాలు సమర్పిస్తున్నారు.