రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్
అమరావతి మార్చి 24
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగింది. ప్రధాన నగరాలతో పాటు అన్ని చోట్లా వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలు అడ్డుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపి వేసారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల వద్ద నిలిచిపోయాయి. రైతు బజార్ల వద్ద ఉదయం 9 గంటలకు కూరగాయల విక్రయాల నిలిపివేసరు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న అధికార యంత్రాంగం, నిర్దిష్టమైన కారణం లేకుండా వాహనాలతో రోడ్లపైకి వచ్చి వాళ్ళను నిలిపివేసింది. పలు వాహనాల సీజ్ రామవరప్పాడు వద్ద పోలీస్ చెక్ పోస్ట్ దాటేందుకు అతి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలుఅయ్యాయి. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి ఎవరూ రావద్దంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పలు వాహానాలను సీజ్ చేసారు. మరోవైపు, పారిశుద్ధ్య కార్మికుల కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాయి.