కరోనాపై యుద్దం
హైదరాబాద్, మార్చి 24
ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 15,24,266 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించాం. ల్యాండ్ బోర్డర్ వద్ద 19లక్షల మందికి పైగా స్క్రీనింగ్ చేశాం. ఇప్పటి వరకు కరోనా కేసులు 492 (37 డిశ్చార్జయిన కేసులు కలిపి) నమోదయిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కమ్యూనిటీ సర్వైలెన్స్ కింద విదేశాల నుంచి వచ్చి ఇళ్లల్లో ఉన్నవారిని క్వారంటైన్ చేశాం. వారి ఇంటికి మెడికల్, పారా మెడికల్ స్టాఫ్ వెళ్లి పరీక్షలు చేస్తున్నాం, ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టాం. అలా 94,963 క్వారంటైన్ బెడ్స్ సిద్ధం చేశామని అన్నారు. ప్రతిరోజూ 20,000 మందికి కరోనా టెస్ట్ చేసే సామర్థ్యం ఏర్పాట చేసుకున్నాం. ఇతర దేశాల్లోని 2,040 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాం. సుమారు 48 దేశాల నుంచి భారత ప్రభుత్వ ఖర్చుతో వారిని తీసుకొచ్చాం. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో రీ-కన్ఫర్మేషన్ చేస్తున్నాం. 5 లక్షల పర్సనర్ ప్రొటెక్షన్ కిట్స్, 10 లక్షల మాస్కులు సిద్ధం చేశాం. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండ బ్యాన్ చేశామని వివరించారు. ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రులను కూడా కరోనాపై యుద్ధంలో సిద్ధం చేశాం. కొత్త కిట్స్ తయారు చేసే ఫ్యాక్టరీలకు నాణ్యమైన కిట్స్ తయారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. ప్రతి వారం టెస్టింగ్ ల్యాబులను జాబితాలో చేర్చుతున్నాం. అన్ని రాష్ట్రాల్లోని ఎయిమ్స్ ఆసుపత్రులు ఆయా రాష్ట్రాల్లోని మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ఆదేశాలిచ్చామని అయన అన్నారు.