అరకువాలీ లో 144 సెక్షన్ అమలు: ఎసై అరుణ్ కుమార్
మార్చి 24
జనతా కర్ఫ్యూ ఏవిధంగా అయితే పాటించారొ అదేవిధంగా ఈనెల 31 వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అవ్వాలని, సోషల్ డిస్టెన్స్ మనిషికి మనిషికి ఆరడుగుల దూరం పాటించాలని కోరారు అరకువాలీ సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ . అత్యవసర సేవలు పాలు, మందులు, నిత్యవసర వస్తువుల షాపులు మరియు హాస్పిటల్స్ తప్ప మరి కమర్షియల్ షాపులు ఉండకూడదని హెచ్చరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురి కన్నా ఎక్కువ మంది గుంపుగా ఉండ కూడదని తగు జాగ్రత్తలు పాటించి రోడ్లపై తిరగకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా మూడు పోలీస్ పార్టీల ద్వారా పట్టణంలో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు జరిపేవారు అయ్యినా కారణం చెప్పాలని, ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, మీడియా మినహా ఎవరికి అనుమతులు ఇవ్వవద్దని ఆదేశాలు జారీచేశారు. అలాగే మీడియా మిత్రులు కరోనా వైరస్ పై వార్తలు ప్రచారం చేసే టప్పుడు అధికారులను హెల్త్ డిపార్ట్మెంట్ వారిని గాని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గాని సంప్రదించి వార్త ప్రచారం చేయాలని ఆయన తెలియజేశారు.