YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

32రాష్ట్రాలు, యూటీలు పూర్తి లాక్‌డౌన్!

32రాష్ట్రాలు, యూటీలు పూర్తి లాక్‌డౌన్!

32రాష్ట్రాలు, యూటీలు పూర్తి లాక్‌డౌన్!
దిల్లీ, మార్చి 24
కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తి లాక్‌డౌన్‌ విధించాయని తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 560జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు ఒడిశాలోని 30 జిల్లాల్లో కూడా ఈ అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ అమలుచేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి లాక్‌డౌన్‌ విధించని యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కూడా ఆంక్షలు అమలుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కేవలం సోమవారం ఒక్కరోజే 99 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలను ప్రజలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో దేశప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షలను పాటించకుండా వాహనాలతో రోడ్లపైకి వస్తున్న వారిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. లాక్‌డౌన్‌ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపునిస్తున్నారు.

Related Posts