లాక్‌డౌన్.. రంగంలోకి దిగిన సజ్జనార్
హైదరాబాద్, మార్చి 24
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. కానీ వాహనదారులు నిబంధనలు పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన కారణం చెప్పకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. రోడ్లపైకి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సీపీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో రహదారిపైకి వచ్చిన వాహనదారులను ఆపి.. లాక్‌డౌన్ ఉద్దేశాన్ని వివరించారు. అత్యవసరమైన వారు మినహా ఇతరులను తిరిగి వెనక్కి పంపుతున్నారు. నగరంలోని పలు కూడళ్లలోనూ పోలీసులు ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారుల వివరాలు సేకరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని వెనక్కి పంపడంతో పాటు ... ఒక్కో ద్విచక్రవాహనంపై ఒకరు, కార్లలో అయితే ఒకరు లేక ఇద్దరు రావాలని స్పష్టం చేస్తున్నారు