3 అక్షరాలే అయినా ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా వైరస్.
-నెల్లూరులో ప్రశాంతంగా కొనసాగిన లాక్ డౌన్.
నెల్లూరు, మార్చి 24
మూడు అక్షరాల నామకరణం కలిగిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి కాదని ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఎక్కడో చైనా దేశంలో గుర్తించబడిన కరోనా వైరస్ అంచలంచలుగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ మేరకు ఇటలీ దేశ ప్రధాని కన్నీటి ఆవేదనను వ్యక్తీకరించిన సందర్భంలో ఆయన చెప్పిన వివరాల మేరకు కరోనా వైరస్ ను అంత తేలిగ్గా కొట్టిపారేసే విషయం కాదన్నారు. ఇటలీ దేశంలో కరోనా వైరస్ కారణంగా ఆ దేశ ప్రజలు గుట్టలుగుట్టలుగా, పిట్టల వలె రాలి పోతున్నారని , వారందరినీ పూడ్చి పెట్టేందుకు కూడా సభ్య సమాజం ప్రజలు ముందుకు రావడం, అటుంచితే కరోనా వైరస్ కారణంగా మరణించిన వారందరినీ పూడ్చి పెట్టేందుకు కూడా తమ దేశంలో స్థలం సరిపోలేదు అంటూ కన్నీటిపర్యంతమైన సందర్భం ఉంది. కరోనా వైరస్ ను మట్టుపెట్టేందుకు ప్రపంచ దేశాలు ఏకమై ప్రయత్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు ల్యాబ్ లకు ఖర్చు పెట్టినప్పటికీ సరైన వ్యాక్సిన్ ను కనుగొన్నట్లు అధికారిక సమాచారమే లేదు. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ లేదా సరైన మందును కనిపెట్టేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు నిర్వహించిన జనతా లో భాగంగా , కరోనా వైరస్ నిరోధానికి మరియు ప్రజలకు అవగాహన కల్పిస్తూ , తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు , ప్రజలను రోడ్లపై గుంపులు గుంపులుగా తిరగకుండా, వారికి ఆరోగ్య భద్రత కల్పించడంలో పోలీసులు, వీరిద్దరి సేవలను ప్రజలకు చేరవేస్తూ జర్నలిస్టులు గత మూడు రోజులుగా చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలో మూడవరోజు జనతా కర్ఫ్యూ లో భాగంగా, జిల్లా అధికారులు సూచనల మేరకు నెల్లూరు జిల్లా ప్రజలు లాక్ డౌన్ కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు నిత్యావసర లైనా త్రాగునీరు, కూరగాయలు, పాలు అమ్మకాలు సాగించే దుకాణాలు తప్ప , ఇతర దుకాణాలను నెల్లూరు పోలీస్ శాఖ వారు ప్రత్యేక పర్యవేక్షణలో మూయించారు. అంతేకాకుండా నెల్లూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక ఆటోను వీధుల వెంబడి తిప్పుతూ, కరోనా వైరస్ వ్యాధి నిర్మూలనకై, ప్రజలు సహకరించాలని, సింహపురి ప్రజలను అత్యవసర ఈ పరిస్థితుల్లో తప్ప , రోడ్ల పైకి రాకుండా, తమ తమ ఇండ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా మూడు అక్షరాల కరోనా వైరస్ ప్రజలను ముచ్చెమటలు పట్టిస్తూ , మూడు చెరువుల నీరు తాగి స్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదని సింహపురి ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. జిల్లా ప్రజల ఆరోగ్యాల కోసం నిరంతరం శ్రమిస్తున్న జిల్లా వైద్యులకు, పోలీసులకు, జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.