మూడింతలైన శానిటైజర్ ధరలు
నల్గొండ, మార్చి 26
చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కాలర్ ట్యూన్ నుంచి మెస్సేజ్‌ల దాకా పదేపదే గుర్తుచేస్తున్నా.. వాటిని కొనుగోలు చేయడం మాత్రం సామాన్య కుటుం బాలకు అందని ద్రాక్షగానే మారింది. మెడికల్ షాపుల్లో ఉన్నదానికంటే మూడిం తలు పెంచేయడంతో పేద, మధ్య తరగతికి చెందినవారు సబ్బులతోనే సరిపెట్టు కోవాల్సి వస్తున్నది. మాస్కులతో పాటు శానిటైజర్ల ధరలు ఎమ్మార్పీ కంటే రెండిం తలు పెంచి అమ్ముతున్న తంతు హైదరాబాద్‌లో ప్రజల ఆగ్రహానికి దారితీస్తున్న ది. వైద్యుల సూచన మేరకు విరివిగా మాస్క్‌లు, శానిటైజర్లను కొనుగోలు చేస్తుండటంతో విక్రయదారులు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. మాస్క్ ల ధర రూ.10కి మించరాదనీ, 200 ఎం.ఎల్ ఉన్న శానిటైజర్ ధర రూ.90 కంటే ఎక్కు వకు విక్రయించరాదని కేంద్ర ప్రభుత్వం మూడ్రోజుల క్రితం ఖరారు చేసింది. జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నా ఎక్కడా ఉన్న ధరకు అమ్మడం లేదు. 100ఎం.ఎల్ శానిటైజర్ రూ.45లకు అమ్మాలని నిబంధన లున్నా .. కొన్ని షాపుల్లో రూ.130, 200ఎం.ఎల్ బాటిల్ రూ.200కు అమ్ముతూ మెడికల్ షాపుల నిర్వాహకులు సొమ్ముచేసుకుంటున్నారు. మాస్క్‌లను సైతం రూ.15 నుంచి వందకుపైగా అమ్ముతున్నారు. పది రోజుల కిందట రూ.4 ఉన్న మాస్క్ ధర పదింతలు పెరిగింది. ఈ ధరకైనా కొనుగోలు చేద్దామంటే కొన్ని మెడికల్ షాపుల్లో ఎన్-95 మాస్క్‌లే లభించడం లేదు. పైగా ధరలు పెంచినా అధికారుల పర్యవేక్షణ కరువైందని కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.