Highlights
ముగిసిన గత పదవీ కాలం
మరోసారి అవకాశం ఇచ్చిన ప్రధాని
సభలో ప్రకటన చేసిన చైర్మన్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభ నేతగా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు మంగళవారం ప్రకటన చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి మరోసారి రాజ్యసభకు జైట్లీ ఎన్నికయ్యారు. దీంతో మరోసారి సభా నాయకునిగా ఆయనకు అవకాశం లభించింది. అరుణ్ జైట్లీ ఇప్పటికే రాజ్యసభా నాయకునిగా ఉండగా ఆయన గత సభ్యత్వ గడువు సోమవారం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఉదయం సభ ప్రారంభమైన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నుంచి తనకు ఓ లేఖ వచ్చిందని చైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జైట్లీని మరోసారి రాజ్యసభ నాయకునిగా ప్రధానమంత్రి నియమించినట్టు అందులో పేర్కొన్నారని వెంకయ్యనాయుడు తెలిపారు.