YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 మంచిర్యాలలో  ప్రైవేట్ పోటు

 మంచిర్యాలలో  ప్రైవేట్ పోటు

 మంచిర్యాలలో  ప్రైవేట్ పోటు
మంచిర్యాల, మార్చి 26
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగిస్తున్న అక్రమ వైద్యంపై ఎట్టకేలకు సంబంధిత శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలో ప్రైవేట్ వైద్య వ్యాపారం యం త్రాంగాన్ని శాసించే స్థాయికి ఎదిగిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నిర్మల్‌తో పాటు భైంసా, ఆదిలాబాద్, ఉట్నూర్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, రామకృష్ణాపూర్ తదితర చోట్ల అనుమతులు లేకుండా పలు క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు కొనసాగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ ఆసుపత్రులలో రోగులకు అవసరమయ్యే కనీస సౌకర్యాలు లేకున్నప్పటికీ ఆ సౌకర్యా లు, వైద్య సేవల పేరిట అమాయక రోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుం జుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే కొంత మంది ప్రైవేట్ వైద్యుల నిర్వాకం కారణంగా పవిత్రమైన వైద్య వృత్తి అభాసు పాలయ్యే ప్రమాదం ఏర్పడిందన్న వాదనలున్నాయి. మరికొంత మంది ఎలాంటి ఉన్నత విద్యార్హతలు లేకున్నప్పటి కీ పీజీ, డిగ్రీ, డిప్లొమా కలిగి ఉన్నట్లు చెప్పుకుంటూ రోగులకు స్పెషలైజేషన్ చికిత్సలు అందిస్తున్నారు. ఇలాంటి వైద్యుల కారణంగా ఇప్పటికే చాలా చోట్ల అమాయక రోగులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. కాగా మరికొంత మంది గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులను మధ్యవర్తులుగా మధ్యవర్తులుగా ని యమించుకొని వారి ద్వారా గ్రామీణ ప్రాంత రోగులకు గాలం వేస్తున్నట్లు విమర్శలున్నాయి. అయితే  ఇలా మధ్యవర్తులకు ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు నజరానా రూపంలో పెద్ద మొత్తంలోనే కమీషన్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా వివిధ రోగులను పట్టి పీడిస్తూ వారి నుంచి ఫీజుల రూపంలో వేల రూపాయలను గుంజుతుండడం సాదారణమయ్యిందని అంటున్నారు. ఇలా నకిలీ వైద్యులు, అక్రమ వైద్యం, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ లాంటి వ్యవహారాలపై ఎట్టకేలకు వైద్యారోగ్యశాఖ స్పందించింది. దీనికోసం గాను జిల్లాల వారీగా ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా గత నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  తనిఖీ బృందాలు పలు ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లపై దాడులు జరిపి ఆ ఆసుపత్రుల అక్రమాలను బట్టబయలు చేశాయి. అక్రమాలకు పాల్పడిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సైతం అధికారుల బృందం సీజ్ చేసిన ఉదంతం తనిఖీల తీవ్రతకు అద్దం పడుతుందని అంటున్నారు.

Related Posts