YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

 క్వారంటైన్ కోసం సెక్రటేరియట్...?

 క్వారంటైన్ కోసం సెక్రటేరియట్...?

 క్వారంటైన్ కోసం సెక్రటేరియట్...?
హైద్రాబాద్, మార్చి 26
రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌, అనుమానిత కేసులతో ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులు సరిపోవని అర్థమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రం కోవిడ్‌-19 విషయమై రెండవ దశ అంటే సంక్రమణ దశలో ఉన్నది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు స్థానికులు ఇద్దరు (ప్రైమరీ కాంటాక్ట్‌) ఆ వ్యాధి బారిన పడ్డారు. ఈ దశ దాటితే మూడవ దశ అంటే ప్రైమరీ కాంటాక్ట్‌ నుంచి ఇతరులకు సంక్రమించే దశలో దీన్ని నిలువరించడం మరింత కష్టసాధ్యంగా మారుతుంది. ఈ దశలోనే దీన్ని కట్టడి చేయాలని భావించిన సర్కారు బోధనాస్పత్రుల్లో అత్యవసర సేవలను కొనసాగిస్తూ మిగిలిన సేవలను తాత్కాలికంగా ఆపేసింది. సౌకర్యాలను, సిబ్బందిని కోవిడ్‌ నియంత్రణ, చికిత్స కోసం పూర్తి స్థాయిలో వాడుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా మార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు కింగ్‌కోఠి ఆస్పత్రిని రోగుల సేవలను నిలిపేసి అక్కడ ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే బదులుగా కోవిడ్‌ బారిన పడ్డవారితో పాటు, అనుమా నితులను పర్యవేక్షించేందుకు బీబీనగర్‌ లోని ఎయిమ్స్‌ కానీ, వికారాబాద్‌లోని ఛాతి వ్యాధుల చికిత్సా కేంద్రాన్ని గాని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే బాగుంటుందనే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు.గాంధీ, చెస్ట్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బంది సౌకర్యాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర రోగులకు, వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి అందరికి సరిపోయే విశాలమైన సచివాలయం ఐసోలేషన్‌ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఖాళీ చేసిన భవంతులతో కలుపుకొని ఎ, బి, సి, డి, హెచ్‌ సౌత్‌, నార్త్‌, కె, జె, కె.ఎల్‌ బ్లాకులుగా బహుళ అంతస్తులతో విశాలంగా ఉన్నది. ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కొంత మంది అధికారులు అంటుండంగా, సీసీఎంబీకి పరీక్షల కోసం కేంద్రం నుంచి వెంటనే అనుమతి తీసుకున్న రాష్ట్ర సర్కార్‌కు ఇది పెద్ద పని కాదని మరికొందరంటున్నారు. కరోనా ముంచుకొచ్చిన ప్రమాదమనీ, డాక్టర్లు, ఐసోలేషన్‌ వార్డులు అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెంటనే తరలించి సేవలందించామని అధికారులు చెబు తున్నారు. అయితే క్రమేణా పెరుగు తున్న కేసుల రీత్యా  ప్రస్తుతానికి అన్ని బోధనాస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయడం, ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రుల సహకారం తీసు కోవడంపైనే ప్రభుత్వం దష్టి సారిం చింది. ఇందులో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే వేలాది మంది రోగులకు కరోనా చికిత్సలు చేయడానికి వీలవుతుంది.

Related Posts