YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నేరుగా క్వారంటైన్ కేంద్రాలకే

నేరుగా క్వారంటైన్ కేంద్రాలకే

నేరుగా క్వారంటైన్ కేంద్రాలకే
అమరావతి మార్చి 26  
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో సమస్య పరిష్కారం అయింది. ఏపీ  సరిహద్దు ప్రాంతంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం నుండి  వచ్చిన 44 మందిని నూజివీడులోని క్వారంటీన్ కు బస్సుల్లో  అధికారులు తరలించారు. దాంతో  కొందరు వాహన దారులు హైదరాబాద్ కి తిరిగి వెళ్లిపోయారు. క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకరించని  200 మందిని సురక్షితంగా పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేసారు. ప్రస్తుతం తెలంగాణ వైపు నుండి వచ్చే కార్లను తెలంగాణ చెక్ పోస్టు నుంచే వెనక్కి పంపుతున్నారు. అత్యవసర పనులకు సంబంధించి మెడికల్ సంబంధిత కారణాలతో తగిన సాక్ష్యాలతో క్లీన్ సర్టిఫికెట్ లు కలిగి ఉన్న వాళ్ళకి అనుమతినిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ లోని కి అనుమతించడం లేదని ఎక్కడి వారు అక్కడే తమ నివాసాలకు పరిమితం కావాలని సూచిస్తున్నారు. జగ్గయ్యపేట వద్ద హైదరాబాద్ నుంచి వచ్చి వేచిచూస్తున్న వారికి రాష్ట్రంలోకి అనుమతిఇచ్చారు. ప్రత్యేక బస్సుల ద్వారా హెల్త్ప్రోటో కాల్ కోసం వారిని తరలిస్తున్నారు. వారిని వైద్య పరీక్షలకోసం క్వారంటైన్ చేస్తున్నారు. పగడ్బందీగా హెల్త్ ప్రోటోకాల్ను పాటిస్తున్న అధికారులు గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్ ఐటీకి తరలిస్తున్నారు. ఈస్ట్  గోదావరి వారిని రాజమండ్రి క్వారంటైన్ కు,  వెస్ట్ గోదావరి  వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలిస్తున్నారు.

Related Posts