లాఠీ చేత పట్టిన ఎమ్మార్వో
రాజన్న సిరిసిల్లా మార్చి 26
కరోనా కట్టడికి పోలీసు రెవెన్యూ అధికారులు తమ వ్యక్తిగత జీవితాలను, ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను అప్రమత్తులను చేస్తుంటే కొంత మంది ప్రభుద్దులు తమ వ్యాపారాలను నిర్వహిస్తూ ప్రభుత్వ హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో ఓ రెవెన్యూ అధికారిణి కాళికావతారం ఎత్తి వారి బడితపూజ చేసిన సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటుచేసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తి దండంపెట్టి లాక్ డౌన్ లో బాగంగా బయటకు రావద్దని, బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఇంట్లోనే ఉండి కరోనా కట్టడికి అందరూ కలసి కట్టుగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దండం పెట్టి ప్రజలెవరూ బయటకు రావద్దని, అవసమైతే మీకవసరమైన నిత్యావసరాలు మీ ఇంటికే పంపే ఏర్పాటు కూడా చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలు, పోలీసు రెవెన్యూ అధికారులు ప్రాణాలకు తెగించి ప్రజలను అప్రమత్తం చేస్తుంటే కొంత మంది స్వార్ధ పరులు, దేశ ద్రోహులు ఎవరేమైతే నాకేంటి అనే రకంగా తమ తమ వ్యాపార కార్యకలాపాలను అధికారుల కళ్లుగప్పి నిర్వహిస్తున్నారు. దీంతో రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట తహశీల్దార్ సుమా చౌదరి లాఠీ చేత పట్టి కాళికావతారం ఎత్తారు. ప్రజల్లో కరోనా అవగాహన కోసం వేల మంది ప్రభుత్వాధికారులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి లాక్ డౌన్ చేసి ఇళ్లలో ఉంటే నీ లాంటి ఛీడపురుగులు బయట కరోనాను అంటించడానికి, వ్యాప్తి చేందడానికి కారణమవుతున్నారని మండి పడ్డారు. సదరు కల్లు డిపోను సీజ్ చేసి వారి పై కేసు నమోదుకు పోలీసులను అదేశించారు.