కరోనాపై పోరాటానికి రూ.20 లక్షల
విరాళం ప్రకటించిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆంధ్రప్రదేశ్ కు రూ.10 లక్షలు, తెలంగాణకు రూ.10 లక్షలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందచేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.