నాగార్జునసాగర్ లో తెలంగాణ ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ఉద్రిక్తత
నాగార్జున సాగర్ మార్చి 26
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మనదేశం, రాష్ట్రంలో అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో హాడావుడి ప్రారంభమయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో కచ్చితంగా లాక్ డౌన్ పాటించాలంటూ అధికారులు చెబుతున్నా ప్రజలకు మాత్రం అప్రమత్తం కాకపోవడం గమనార్హం. పట్టణాలలో నివసిస్తున్న వారు తమ పల్లెలకు వెళ్లడానికి సిద్ధం చేసుకున్నారు. హైదరాబాదులో నివసిస్తున్న వారు తమ దగ్గరి పోలీస్ స్టేషన్లలో రాతపూర్వకంగా తమ స్వగ్రామానికి వెళ్ళడానికి వీలు కల్పించండి అని వినతి పత్రం ఇచ్చి అనుమతులు తీసుకుంటున్నారు. ఇక ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వారిని పోలీసులు అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అనుమతులను చూపించినా సరే మాకు ఎటువంటి సమాచారం లేదు. పంపించడానికి కుదరదు అనడంతో నాగార్జునసాగర్ లో రాత్రి రోడ్లపైనే ప్రయాణికులు కుటుంబ సభ్యులు పడుకున్నారు. కొంతమంది చిన్న పిల్లలతో రావడం వల్ల మరింత తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.