కరోనాకు పవన్ కళ్యాణ్ సాయం రూ.2 కోట్లు
అమరావతి మార్చ్ 26
కరోనా మహమ్మారి పై పోరాడేందుకు ప్రధానమంత్రి సహాయనిధికి 1 కోటి రూపాయలు, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమవంతు సాయం ఇదని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటించారు.