Highlights
- నీరవ్ మోదీకి వ్యతిరేకంగా సీ ఏ శ్యామ్ వాధ్వా సాక్ష్యం
పంజాబ్ నేషనల్ బ్యాంకును బోగస్ ఎల్‌ఒయుల ద్వారా రూ.13,700 కోట్ల మేర కొల్లగొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ నిధుల తరలింపుకు సహకరించినట్టు మోదీ సన్నిహితుడైన చార్టర్డ్ అకౌంటెంట్ శ్యామ్ వాధ్వా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులకు వెల్లడించారు. ఇందు కోసం డొల్ల కంపెనీలను ప్రారంభించేందుకు తాను సహకరించానాని చెప్పారు. సోమవారం వరకు ఇడి కస్టడీలో ఉన్న వాధ్వాను మంగళవారం ముంబైలోని పిఎంఎల్‌ఎ స్పెషల్ కోర్టు ఎదుట వాధ్వాను హాజరుపరుస్తారు. విచారణ సందర్భంగా వాధ్వా అధికారులకూ పూర్తిగా సహకరిస్తూ కీలకమైన సాక్ష్యాధారాలను అందిస్తున్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలో హవాలా ఆపరేటర్ల ద్వారా ఈ సొమ్మును సర్క్యులర్ ట్రేడింగ్‌కు రౌండ్ ట్రిప్పింగ్‌కు ఉపయోగించినట్టుగ వాధ్వా అంగీకరించారు. ఈ సొమ్ముతో దేశ విదేశాల్లో సొంత ఆస్తులను నీరవ్‌మోదీ కూడగట్టుకున్నారని కూడా వాధ్వా చెప్పారు.