లక్షా ఢెబ్బై వేల కోట్లతో ఉపాధి సహాయం
న్యూ ఢిల్లీ మార్చ్ 26
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కోసం లక్షా 70 వేల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పేద కుటుంబాలకు మూడు నెలల వరకు ఉచితంగా రేషన్ 10 కిలోల పప్పు 10 కిలోల బియ్యం అందిస్తాం. ఉపాధి హామీ ఐదు ఐదు కోట్ల మంది కూలీలకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున పేదల ఖాతాలలోని నేరుగా సొమ్ము జమ అవుతుందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సందర్భంగా పనిచేస్తున్న వైద్య అధికారులు. నర్సులు. ఆశా వర్కర్లకు యాభై లక్షల వరకు బీమా ప్రకటించారు. దేశ ప్రజలకు ఆహార భద్రత తప్పని సరిగా కల్పిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. కరోనాను అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పారు. దేశ ప్రజలెవరూ ఆకలితో ఉండకూడదన్నారు. వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం. పీఎం కిసాన్ రైతులకు ఇప్పటికే ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం మొదటి విడతగా మరో 2000 వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నామని అన్నారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల ఇస్తాం. పొదుపు మహిళలకు మహిళకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంపు షూరిటీ లేకుండా రుణాలు ఇస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా చిన్న వేతన ఉద్యోగులు ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం. 15,000 కంటే వేతనం తక్కువ ఉన్నా ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగస్తులకు వాటాను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కరోనా కట్టడి కోసం పని చేస్తున్న వైద్య సిబ్బందిని నిర్మలా సీతారామన్ అభినందించారు.