ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉద్యోగ సంఘాల ఒక రోజు జీతం విరాళం
అమరావతి మార్చ్ 26
కోవిడ్–19 నివారణా చర్యలకు ఉద్యోగ సంఘాలు విరాళం ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల నేతలు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి లేఖలు సమర్పించారు. సీఎంను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి రమేష్, ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్.చంద్రశేఖర్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ వై.వి.రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సోమేశ్వర రావు వున్నారు. వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ మా సంఘాల నుంచి ఒక రోజు విరాళం రూపంలో దాదాపు రూ. 100 కోట్లు ఉంటుంది. కోవిడ్ –19 నివారణకోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయి. ముందు చూపుతో సీఎం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ముందుంటున్నాయి. క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు బాగున్నాయి. ఈ పరిస్థితుల్లో అండగా ఉండేందుకు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చామని అన్నారు.