కర్నూలు నగరంలో లాక్ డౌన్ స్వయంగా వాహనాలను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
కర్నూలు, మార్చి 26
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీద, వీధుల వెంట తిరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కే పకీరప్పలు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్, సీ క్యాంపు సెంటర్, నంద్యాల చెక్ పోస్ట్, టెలికాం నగర్, బి క్యాంపు, గుత్తి పెట్రోల్ బంకు, కృష్ణానగర్ ఐటీసీ సర్కిల్, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, హనుమంతు ఘాట్, సంతోష్ నగర్, సీతారాం నగర్, రామలింగేశ్వర నగర్, వెంకటరమణ కాలనీ, అశోక్ నగర్, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా ఆర్ఎస్ సర్కిల్, ఎస్వీ కాంప్లెక్స్ సర్కిల్, ఎన్ ఆర్ పేట, చిరంజీవి పార్కు, కోట్ల సర్కిల్, కొండారెడ్డి బురుజు, ఓల్డ్ టౌన్, గాంధీ నగర్, రాజీవ్ విహార్ మీదగా తదితర ప్రాంతాల్లోని పలు రోడ్లు,
వీధుల్ల కలసి లాక్ డౌన్ లో భాగంగా వాహనం లో కూర్చొని పరిస్థితిని పరిశీలించారు.