YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 క్వారంటైన్ తరువాతే అనుమతి

 క్వారంటైన్ తరువాతే అనుమతి

 క్వారంటైన్ తరువాతే అనుమతి
అమరావతి మార్చి 26 
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను జాతీయ విపత్తు గా ప్రకటించింది. ఎక్కడివారు..అక్కడే ఉండాల్సింది గా..కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని దేశ  ప్రధాని,ముఖ్యమంత్రి చేతులు జోడించి  ప్రజలందరిని  కోరారని ఎపి డిజిపి గౌతం సవాంగ్ గుర్తు చేసారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. ఇది ఇలా ఉండగా నిన్నటి నుండి కొందరు  నిబంధనలకు విరుద్దంగా ఆంధ్ర ప్రదేశ్ లోనికి రావడానికి ప్రయత్నిస్తూ సరిహద్దు తనిఖీ కేంద్రాల దగ్గరకు వచ్చి ఉన్నారు . అయితే అట్టి వ్యక్తులను నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోనికి అనుమతించేది లేదని అయన అన్నారు. బోర్డర్ వద్దకు వచ్చిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా రెండు వారాలపాటు క్యారంటైన్ నిర్వహించిన తరువాతే రాష్ట్రం లోకి అనుమతిస్తాం. లాక్ అవుట్  ఉదేశ్యం ఒక మనిషి  నుండి మరొక మనిషికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అంటు వ్యాధి సంక్రమించకండా ఉండేలాగా చేయడమే.  బయట ప్రాంతాల నుండి ఆంధ్ర ప్రదేశ్ లోనికి అనుమతిచడం మన లాక్ అవుట్  ఉద్దేశ్యాన్ని నీరు గార్చటమేనని అయన అన్నారు.

Related Posts