అంటువ్యాధుల నివారణ చట్టం -1897, అమలు ఇలా..
జగిత్యాల మార్చి 26
అత్యంత ప్రమాదకర పరిస్థితి అయిన కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి అంటు వ్యాధుల నివారణ చట్టం 1897 అమల్లోకి తెచ్చింది.ఈ చట్టం నియమ నిబంధనలు సమాచారార్థం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ,న్యాయవాది హరి అశోక్ కుమార్ తెలిపారు. అంటువ్యాధుల నివారణ చట్టము 1897 అనేది అంటువ్యాధుల నివారణకు బ్రిటిష్ కాలంలో తయారు చేసిన చట్టం.దాదాపుగా భారత దేశ చట్టాల్లో అన్నిటికన్నా చిన్న చట్టము ఇదే.ఇందులో కేవలము నాలుగు సెక్షన్ లే ఉంటాయి.సెక్షన్-1 ఈచట్టం గురించి వివరిస్తుంది. సెక్షన్ -2 చట్టం అమలును తెలియ జేస్తుంది.సెక్షన్- 3 చట్టం ఉల్లంగిస్తే పడే శిక్ష లను వివరిస్తుంది.సెక్షన్-4 చట్టం విధి విధానాలు తెలుపుతుంది. ఈ చట్టంలో సెక్షన్ -2 అత్యంత కీలకమైనది.భారత భూభాగం లో కొంత భాగం లేదంటే దేశ వ్యాప్తంగా ఎక్కడైనా అంటువ్యాధులు ప్రజలను ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడుతున్న సందర్భాల్లో ఈ చట్టం అమలు చేయాలని సూచిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు, నిబంధనలు ప్రజలు తప్పనిసరి గా పాటించేలా చట్టబద్ధం చేస్తుంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిథిలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి.ఎక్కువ మందిని నష్ఠపరిచే స్థాయిలో అదుపు తప్పే అస్కారముంటే ఈచట్టాన్ని అమలు చేస్తారు. ఈ చట్టం ఒకరకంగా వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించేలా వుంటుంది. ఉల్లంగిస్తే శిక్షలు తప్పవు.. ఈ చట్టాన్ని ఉల్లంగిస్తే ఐపీసి 188 ను అనుసరించి శిక్షార్హులు. నలుగురి కంటే ఎక్కువగా గుమికూడరాదు. ఈ చట్టం మేరకు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంగిస్తే 6నెలల జైలు,లేదా జరిమానా, తీవ్రతను బట్టి రెండు శిక్షలు విధించే అవకాశం ఈ చట్టం చింది.