ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ను సందర్శించిన క్రీడల మంత్రి పద్మారావు తెలంగాణా లో సైతం అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాల కోసం గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా లో జరిగే 2018, కామన్వెల్త్ క్రీడల కోసం వెళ్ళిన తెలంగాణా రాష్ట్ర క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ నేతృత్వం లోని రాష్ట్ర క్రీడల వ్యవస్థకు సంబంధించిన ఉన్నత స్థాయి బృందం మంగళవారం మెల్బోర్న్ లోని ప్రతిష్టాత్మకమైన “మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్” ను సందర్శించారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియాల్లో ఒకటైన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం లోని సదుపాయాలను మంత్రి పద్మారావు నేతృత్వంలోని బృందం ఈ సందర్భంగా పరిశీలించింది. స్టేడియం నిర్మాణ తీరుతెన్నులు, సాంకేతిక అంశాలు, క్రీడాకారులకు కల్పించే సదుపాయాలు, ప్రేక్షకులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించింది.
ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణా రాష్ట్రాన్ని కూడా క్రీడల పరంగా అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
బృందంలో తెలంగాణా క్రీడల ప్రాదికారత సంస్థ (SATS) చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, రాష్త్ర ప్రభుత్వ క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం, మంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ ఎస్.ఎం. రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో తెలంగాణా బృందానికి ఘన స్వాగతం లభించింది.