YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరులో అంతా బాగుంది

చిత్తూరులో అంతా బాగుంది

చిత్తూరులో అంతా బాగుంది
అమరావతి మార్చి 26
చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్‌ ఆందోళనకర స్ధాయిలో లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో ఓ వ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని ఆయన తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి విదేశాల నుంచి వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అధికారులు పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇక కుంటుంబ సభ్యులందరికీ  నెగటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా వైరస్‌ నివారణకు మాస్కులు ఒక్కటే పరిస్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. తప్పకుండా స్వీయ నిర్బంధం పాటించాలని మంత్రి సూచించారు. రైతులు పండించే కూరగాయలు సకాలంలో మార్కెట్‌కు చేరేలా చర్యలు తీసుకొంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వెంటిలేటర్స్ కొరత ఉందని.. వెంటనే తగినన్ని వెంటిలేటర్లు సమకూర్చుతామని ఆయన చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే కూడా అప్రమత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులకు సహాయ సహకారాలు అందించానలి సూచించారు. ప్రజలకు వైరస్‌ వ్యాపించకుండా అవగాహన కల్పించాలని మంత్రి చెప్పారు. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠినమైన కేసులు తప్పవని.. గ్రామ వాలంటీర్లుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పెద్దిరెడ్డి కోరారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Related Posts