YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ

 చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ

 చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ
-ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ఉచిత పంపిణీ
-జిల్లాలో  2.4 లక్షల రేషన్ కార్డుదారులకు 7580 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
-ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేయాలి
-చౌక ధరల దుకాణాల వద్ద సబ్బు, సానిటైజర్లను సిద్ధంగా ఉంచాలి
-కార్డుదారులు క్యూ లైన్ పాటించాలి - మూడు అడుగుల దూరంలో వరుస క్రమంలో ఉండాలి
--జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావ 
నిర్మల్, మార్చ్ 26 
జిల్లాలో  శుక్రవారం నుండి ప్రతి రేషన్ కార్డుదారునికి చౌక ధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు అన్నారు. గురువారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో చౌక ధరల దుకాణాల డీలర్లు లతో  నిర్వహించిన సమావేశంలో ఆయనపాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం నుండి ప్రజా పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని12,463 అంత్యోదయ ఆహార కార్డులు,192103 ఆహార భద్రత కార్డులు,34 అన్నపూర్ణ కార్డులు మొత్తం రెండు లక్షల నాలుగు వేల ఆరు వందలు ఆహారం కార్డుదారులకు 7580.783 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున శుక్రవారం నుండి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ (కోవిడ్19) విస్తరిస్తున్న నందున చౌకధరల దుకాణాల డీలర్లు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగు  జాగ్రత్తలు విధిగా పాటించాలని ఆదేశించారు. ప్రతి డీలర్ దుకాణం ను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచాలన్నారు. కార్డుదారులు ఒకేసారి దుకాణము నకు రాకుండా డప్పు చాటింపు చేసి వాడల వారీగా వచ్చుటకు కూపన్లు ఇవ్వాలని ఆ కూపన్ల పై కార్డుదారుడు సరుకు తీసుకోవాల్సిన సమయం తేదీ రాయాలన్నారు. గంటకు 10-15 లావాదేవీలు అంటే రోజు 50-100 మందికి మాత్రమే లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు. దుకాణం వద్ద సబ్బు/ సానిటైజర్లను సిద్ధంగా ఉంచి కార్డుదారులు వారి చేతులను కడిగిన తర్వాతనే ఈపాస్ యందు వారి యొక్క వేలిముద్రలు తీసుకున్న తర్వాత ఈపోస్ స్కానర్ ను గుడ్డతో  శుభ్రం చేయాలన్నారు. కార్డుదారులు అందరూ గుంపులుగా ఉండకుండా ఒకరికి ఒకరికి మధ్య మూడు అడుగుల దూరంలో వరుస క్రమంలో ఉండేలా చూడాలన్నారు. ఇట్టి జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
 

Related Posts