దేశంలోనే తొలిసారి ఒడిశా రాష్ట్రంలో...1000 పడకలతో కరోనా ఆస్పత్రి...
ఒడిశా మైనింగ్ కార్పొరేషన్, మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థలు ఆర్థిక సాయంతో కేవలం 15 రోజుల్లోనే ఇలాంటి ఓ భారీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భువనేశ్వర్‌లో 1000 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడం కోసం SUM, KIIMS తో ఒడిశా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా కరోనా వైరస్ రోగుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ రెండు ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు 15 రోజుల్లోనే అందుబాటులోకి రానున్నట్టు తెలిసింది. KIIMS ఆస్పత్రి 450 బెడ్స్ ఆస్పత్రిని నెలకొల్పనుంది. SUM మేనేజ్‌మెంట్ 500 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఐసీయూ సేవలను కూడా అందించనున్నారు