కరోనా సామూహిక వ్యాప్తి మొదలవుతుంది.. కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ, మార్చ్ 26
గడిచిన 24 గంటల్లో దేశంలో 42 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని, నలుగురు చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ భారత్‌లో 649 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కేంద్రం వినతి మేరకు 17 రాష్ట్రాలు ప్రత్యేకంగా కోవిడ్ కోసం హాస్పిటళ్లను ఏర్పాటు చేసే పని ప్రారంభించాయన్నారు. కరోనా కేసుల సంఖ్య గుతున్నప్పటికీ.. పెరుగుతున్న రేటు నిలకడగానే ఉందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని లవ్ అగర్వాల్ తెలిపారు.మనమంతా కలిసి కట్టుగా పని చేయకపోతే... ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే.. భారత్‌లో కరోనా సామూహిక వ్యాప్తి దశ ప్రారంభం అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హెచ్చరించారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ... తగిన చికిత్స అందిస్తే ఇలా ఎప్పటికీ జరగదని లవ్ అగర్వాల్ భరోసా ఇచ్చారు. మొత్తం కేసుల్లో 20-30 శాతం కేసుల కాంటాక్టులను గుర్తించలేకపోతే.. నిబంధనల ప్రకారం దాన్ని కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌గా పరిగణిస్తామన్నారు. ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదన్నారు.ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు సాయంతో కరోనా పేషెంట్లు, కోలుకున్నవారి చికిత్సకు సంబంధించి ఆన్‌లైన్ ఓరియెంటేన్ ప్రోగ్రాం చేపడతామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజలు లాక్‌డౌన్‌ను వ్యక్తిగత బాధ్యతగా పరిగణించాలని కోరింది.