YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరీంనగర్ ఆ గ్రామం అంతా క్వారంటైన్

కరీంనగర్ ఆ గ్రామం అంతా క్వారంటైన్

కరీంనగర్ ఆ గ్రామం అంతా క్వారంటైన్
కరీంనగరం, మార్చి 26
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లిలో కరోనా కలకలం రేగుతోంది. వైద్యాధికారులు ఇంటింటికీ తిరుగుతూ పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఏం జరిగిందో తెలియక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందం కాశ్మీర్ గడ్డ తదితర ప్రాంతాల్లోనూ తిరిగారు. అయితే.. అదే సమయంలో నీలోజిపల్లికి చెందిన సుమారు 31 మంది రైతులు కాశ్మీర్ గడ్డలో కూరగాయలు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అధికారులు నీలోజీపల్లి గ్రామంలో తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామ ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. హౌస్ క్యారైంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. కూరగాయల అమ్మకాలు పూర్తిగా నిలిపేయాలని ఆదేశించిన్లు తెలుస్తోంది. గ్రామంలోని వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 44కి పెరిగాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశం. దోమల్‌గూడకు చెందిన 43 ఏళ్ల వైద్యుడు.. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వైరస్ సోకింది. ఆ వైద్యుడి ద్వారా అతడి భార్య (36)కు కూడా కరోనా సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన మరో వ్యక్తిలోనూ కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇతడికి కూడా ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా సోకిన కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది.

Related Posts