పెళ్ళిళ్ళను తాకిన కరోనా! రద్దు చేయలేని పరిస్థితి
పెళ్లి ముహూర్తాలకు అనువైన ఏప్రిల్, మే నెలలలో పెళ్లిళ్లకు అన్ని ఏర్పాట్లు అడ్వాన్సులు ఇచ్చి ఫంక్షన్ హాల్స్ ని నాలుగు నెలల ముందే బుక్ చేసుకున్న వారి పరిస్థితి హృదయ విదారకంగా తయారయ్యింది.మునుగానే షాపింగ్ చేసినవారు కొందరైతే, ఇప్పుడు చేద్దామన్న లాక్ డౌన్లతో షాపింగ్ చేయలేని స్థితిలో మరికొందరు. పెళ్ళికి దూర ప్రాంతాల నుండి వచ్చే బంధువులు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నవారు ఇంకొందరు. అన్నిటికి దేవునిపై భారం వేసి పరిమిత సంఖ్యలో పెళ్ళికొడుకు, పెళ్లికూతురు దగ్గర వారితోనే పెళ్లి జరిపిస్తున్నారు పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు షేక్ హ్యాండ్ ఇస్తున్న వారిని నివారిస్తూ సాదరంగా నమస్కరిస్తున్నారు. పైగా వధూవరులతో పాటు బంధువులు సైతం మాస్క్‌లు ధరించి వివాహ వేడుకకు హాజరవుతున్నారు. కరోనా సోకకుండా ఎంట్రన్స్ లోనే శానిటైజెర్లతో స్వాగతం పలుకుతున్నారు హైద్రాబాద్లో జరిగిన వివాహ వేడుకలో ఈవిధంగా సన్నివేశం కనిపించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారనడానికి ఈ చిత్రమే నిదర్శనంగా చెప్పవచ్చు