వారం రోజుల పాటు రేషన్ బియ్యం పంపిణీ
1 ఏప్రిల్ నుంచి ఈ కుబెర్ ద్యారా 1500 రూపాయలు లబ్ది దారుని అకౌంట్ లలో జమ
- మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ మార్చి 27
లాక్ డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యాన్ని శనివారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వారంరోజుల పాటు బియ్యం పంపిణీ కొనసాగిస్తామని హరీశ్ స్పష్టం చేశారు.ఈ-కుబేర్ ద్వారా ప్రతి రేషన్‌కార్డు లబ్ధిదారుని ఖాతాలో రూ.1500 నేరుగా జమ చేస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. రైతుల నుంచి జంట నగరాలకు కూరగాయలు సరఫరా చేసేందుకు పాసులు అందజేస్తామని.. నిత్యావసర వస్తువులు జంట నగరాలకు చేరేలా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. హైదరాబాద్‌కు నిత్యావసరాలు, కూరగాయలు తీసుకెళ్లే వాహనాలకు బోర్డులు ఏర్పాటు చేయాలని హరీశ్ రావు సూచించారు