YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

దర్గాలో చిక్కుకున్న భక్తులు

దర్గాలో చిక్కుకున్న భక్తులు

దర్గాలో చిక్కుకున్న భక్తులు
స్పందించిన మంత్రి  మేకపాటి
నెల్లూరు మార్చి 27
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏ ఎస్ పేట దర్గాను సందర్శించేందుకు వచ్చిన 329 మంది భక్తులు లాక్ డౌన్ నేపధ్యంలో వుండిపోయారు. వారి భక్తుల అవస్థలను తెలుసుకుని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. భోజన, వైద్య వసతులను ఏర్పాటు చేయాలని వక్ఫ్ బోర్డు అధికారులు, రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా లాక్ డౌన్ పాటించకపోతే మానవత్వంతో అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల నుంచి కూడా బాధ్యత, సామాజిక స్పృహ అవసరం. లాక్ డౌన్ అయిన నేపథ్యంలో భక్తులు ఎవరెవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో  వివరాలను సేకరించాలని సూచించారు. కచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ భోజనాలు అందించేలా చూడాలని ఆదేశించారు. దర్గా వద్ద ఆగిపోయిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూడాలని వక్ఫ్ బోర్డు అధికారులు, జిల్లా కలెక్టర్ తో మంత్రి  మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరూ బయటికి రావద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వాలు పని చేస్తోంది, కొన్ని ప్రత్యేక సందర్భాలలో కఠినంగా ఉండేది కూడా ప్రజల కోసమే. అవగాహన లేక భక్తులు ఎంత చెప్పినా సామాజిక దూరం పాటించడం లేదని పరిస్థితిని ఏఎస్ పేట మండల అధికారులు మంత్రికి తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో  మసీదులలో గ్రూపులుగా ప్రార్థనలు చేయవద్దని ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.

Related Posts