YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు మార్చి 27
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచాం, జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు, ఇతర ప్రదేశాల నుండి వచ్చిన 9646 మందిపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాం ప్రజలెవరూ ఇళ్లను వదిలి బయటకు రాకండని  జిల్లా కలెక్టర్ శ్రీధర్, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. ప్రజలు ఎవరూ కూడా  పెద్ద ఎత్తున గుంపులుగా రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్ ను కలెక్టర్ శ్రీధర్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కూరగాయలు కొనడానికి వచ్చే ప్రజలు మీటర్ దూరం పాటించాలని కూరగాయలు అమ్మకం దారులు తగు జాగ్రత్తలు పాటించి సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ గ్రామాలనుండి కూరగాయలు అమ్మే వారికి గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కూరగాయలను నీడలో అమ్ముకునేందుకు తగిన ఏర్పాట్లను చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని, ఎవరైనా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఈ శ్రీధర్ హెచ్చరించారు.  లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అవసరమైన నిత్యావసర సరకుల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ప్రజలను నియంత్రించడంలో భాగంగా నిత్యావసర సరకుల కొనుగోలుకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 4 గంటల నుంచి  6 గంటలవరకు అనుమతించడం జరుగుతుందని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు.  జిల్లాలో 144వ సెక్షన్‌తోపాటు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు సహకరించాలని, ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఆయన కోరారు. నాగర్ కర్నూలు జిల్లాలో విదేశాల నుండి వచ్చిన వారు 94 మంది వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు 394 మంది ఇతర జిల్లాల నుండి మన జిల్లాకు వచ్చిన వారు 9158 మంది,మొత్తం 9646 మంది గుర్తించడం జరిగిందని వారందరూ స్వీయ గృహ నిర్బంధంలో నే ఉండేందుకు ఖచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేశామని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులు ఎప్పటికప్పుడు వారిపై నిఘా ఉంచి చికిత్స అందజేస్తున్నారు అని కలెక్టర్ తెలిపారు. కొంతమంది పాస్ పోర్ట్ లను సైతం సీజ్ చేశామన్నారు. జిల్లా లో ఒక పాజిటివ్ కేసు కూడా లేదని ఇతర దేశాల నుండి వచ్చిన వారు బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న వారిని తీసుకొచ్చి ప్రతి డివిజన్ కేంద్రంలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎవరు కూడా తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు నడుచుకోవాలని జిల్లాలో  అధికారుల సూచనలను పాటిస్తూ ప్రజలు తమ ఆరోగ్యాలతో పాటు ఇతరుల ఆరోగ్యానికి కాపాడేందుకు ప్రజలందరూ తమ ఇంటిని వదిలి రాకుండా ఉండాలన్నారు. అధికారులు పర్యవేక్షణ చేస్తూ ప్రజల అవసరాలను గుర్తిస్తూ వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ మున్సిపల్ చైర్మన్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts