YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

 కరోనాను జయించిన వూహాన్

 కరోనాను జయించిన వూహాన్

 కరోనాను జయించిన వూహాన్
కరోనా వైరస్‌ను పుట్టించి.. పెంచి.. పెద్దది చేసి.. ప్రపంచానికి పంచిందనే.. అపవాదును మూటగట్టుకున్న చైనా ఇప్పుడు సంబరాలు జరుపుకుంటోంది. చైనాలో కోవిడ్-19 విజృంభన తర్వాత వూహాన్‌లో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో చైనా అంతటా సంబరాలు నెలకొన్నాయి.  వూహాన్ నగరంలోని భవనాలు విద్యుత్ దీపాలతో వెలుగులీనాయి. మొన్నటి వరకు చీకటిలో మగ్గిన ఆ నగరం.. మళ్లీ వెలుగులీనడం చూసి చైనా ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. కరోనా వైరస్ బాధితులు ఆరోగ్యం కోలుకోడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఉహాన్ నగరాన్ని ఇలా ముస్తాబు చేశామని అధికారులు తెలిపారు. గుయిషాన్ టీవీ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కరోనా అణిచివేతకు చైనా అనుసరించిన పద్దతే ఈ జనతా కర్ఫ్యూ. అదీ.. ఏ 14 గంటలో.. 24 గం టలో కాదు. వ్యాధి.. అంతుచిక్కని దశ నుంచి పూర్తి గా అదుపులోకి వచ్చేంత వరకు. వారికి కొత్త సంవత్సర వేడుకల్ని దూరం చేసిన ఈ మహమ్మారి అంతుచూసే వరకు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఈ వ్యాధి గురించి తెలుసు. ఎలా విస్తరిస్తుందో తెలు సు. కానీ, ఇది పుట్టే నాటికి దీని తీవ్రత చైనీయులకు తెలీదు. దాని తీవ్రతను గుర్తించే నాటికే బాధితుల సంఖ్య వేలల్లోకి చేరింది. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన చైనా.. వూహాన్ నగరాన్ని అష్టదిగ్బంధం చేసేసింది. కోటి జనాభా గల ఆ నగరంలో నిర్భంద జనతా కర్ఫ్యూ విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. ఉహాన్ ప్రజల్లో ఇన్ని రోజులు నెలకొన్న భయాన్ని దూరం చేస్తూ.. ఓ వంతెనపై ‘కమాన్ ఉహాన్’.. ‘కమాన్ హుబెయి’.. ‘కమాన్ చైనా’ అనే నినాదాలను ప్రదర్శించారు. నరంలోని మరో థియేటర్‌పై కూడా ఇవే నినాదాలను ప్రదర్శించారు. చైనాలో ‘జీరో’ కేసులు నమోదైన నేపథ్యంలో నెటిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు చైనా కరోనా నుంచి ఉపశమనం పొందుతోంది. మరి, ప్రపంచ దేశాల పరిస్థితి ఏమిటీ? చైనాను చూసి నేర్చుకుంటాయా? అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. వుహాన్ లోని భవనాలు అంకితమైన మెడిక్స్ కోసం ఉత్సాహంగా నినాదాలతో ప్రకాశిస్తున్నాయి అంటూ చైనా మీడియా ఆ ఫొటోలను షేర్ చేసింది.ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కరోనాను కట్టడి చేసిన చైనాను అభినందిస్తున్నారు. మిగతా ప్రపంచం చైనా ను చూసి నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు ట్వీట్ లు చేస్తున్నారు. గుడ్ న్యూస్ చెప్పారు అంటూ మరికొందరు ట్వీట్ లు చేస్తున్నారు.కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పెట్టడంతో హుబెయి ప్రావిన్స్ లోని హాస్పిటల్‌లో సేవలందిస్తున్న మెడికల్ అసిస్టెంట్ టీమ్‌‌లోని మొదటి బ్యాచ్ తమ సొంత ఊర్లకు తిరిగి వెళ్లిపోయారు. జనవరి 23 నుంచి హుహాన్‌లోని 11 మిలియన్ ప్రజలు ఇళ్లల్లోనే బందీలయ్యారు. ‘లాక్‌డౌన్’ వల్ల సుమారు 40 మిలియన్ పైగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రజలంతా ఒకరినొకరు కలుసుకోకుండా ఇన్ని రోజులు ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు 81 వేల మంది వైరస్‌కు గురయ్యారు. అయితే, కేవలం 7,263 మంది మాత్రమే తీవ్రమైన జ్వరంతో కోవిడ్-19కు చికిత్స పొందుతున్నారు. 3,245 మంది చికిత్స పొందుతూ మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,27,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 84,500 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 9,300 మంది చనిపోయారు

Related Posts