YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కాలుష్యంతో నిండిపోతున్న నాగావళి నది

కాలుష్యంతో నిండిపోతున్న నాగావళి నది

కాలుష్యంతో నిండిపోతున్న నాగావళి నది
శ్రీకాకుళం మార్చ్ 27
శ్రీకాకుళం పట్టణం మధ్యలో మురికి నీటితో  ప్రవహిస్తున్న నాగావళి నదిని శ్రీకాకుళం పట్టణ కార్పొరేషన్, శానిటేషన్, ఆరోగ్యశాఖ, అధికారులు పట్టించుకోవడం లేదు.దీనితో నది పూర్తిగా కాలుష్యంతో నిండిపోతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం ప్రజలు ఇంటిలోవాడుక మురికి నీటిని అనేక కాలువల ద్వారా శ్రీకాకుళం నదిలో కలుపుతున్నారు.దీంతో నాగావళి నది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయి ఉంది. ఈ నీటిని అంతంత మాత్రంగా  శుద్ధి చేస్తున్నారు. దీనివల్ల పట్టణ ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. తెలుగుదేశం హయాంలో కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణం ఆనుకొని, కలెక్టర్ కార్యాలయం దగ్గర, వాంబే కాలనీ వెనకాల కొన్ని లక్షల రూపాయలతో మురికి నీటిని శుద్ధి చేసే బావులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు.పట్టణంలోని మురికినీటిని శుభ్రపరిచి నాగావళి నదిలో పంపించడం కోసం వాటిని ఏర్పాటు చేశారు. అయితే ఇంతలో ప్రభుత్వం మారటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. ఇప్పటికే పట్టణ ప్రాంత కరోనా వైరస్ తో భయపడుతుండగా ఇప్పుడు ఈ మురికి నీటి వల్ల మరేం జబ్బులు వస్తాయోనని భయపడుతున్నారు.

Related Posts