ఇంతకు ముందెన్నడూ చూడలేదు
హైదరాబాద్ మార్చ్ 27
ప్రస్తుతం మనం చూస్తున్న, ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ చూడలేదని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన సమయంలో అందరూ బాధ్యతాయుతమైన దేశ పౌరులుగా వ్యవహరించాలని కోరారు. ఒక వైపు కేన్సర్ రోగులకు సేవలందిస్తూనే మరో వైపు కరోనా వైరస్ పై విస్తృత అవగాహన కల్పిస్తున్న ఆస్పత్రి సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎవరికైనా వైరస్ సోకితే అవసరమైన చికిత్స అందించడాన్ని బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ పై పోరాటాన్ని సాగించాలని సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు