14వ రోజు వరకు కరోన రాకపోతే మీ కుటుంబం 90% సేఫ్
బయటిఓకి వెళ్లారో మళ్ళీ 29 రోజుల లాక్ డౌన్ కొనసాగుతుంది
నాగర్ కర్నూల్ మార్చ్ 27
14వ రోజు వరకు కరోన రాకపోతే మీ కుటుంబం 90% సేఫ్, 29వ రోజు వరకు ఏ లక్షణాలు కనపడకపోతే మీరు మీ కుటుంబం 100% సేఫ్. మధ్యలో ఒక్క రోజు బయటకు వెళ్ళినా, బయట వస్తువు ఇంట్లో కి తెచ్చినా అప్పటి నుండి మళ్ళీ 29 రోజుల లాక్ డౌన్ కొనసాగుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తెలిపారు.లాక్ డౌన్ ను చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. రోజంతా ఇంట్లో ఉండి పొద్దున్నే పాల పాకెట్ లు కూరగాయల కోసం మార్కెట్లో ఒకరి మీద ఒకరు పడి ఈరోజు కి ఏదో సాధించా అన్న ఫీలింగ్ తో ఇంటికి వెళుతున్నారు. మీకు తెలియని విషయం ఏమిటంటే మీరు సాధించింది కరోనాని అని పేర్కొన్నారు.అంతే మీరు సాధించింది కరోనాని మాత్రమే. మీరు ఒకేసారి 21 రోజులకీ కావలసినవి తెచ్చుకోవాలి. ఆ తర్వాత బయట నుండి ఏమీ ఇంట్లో కి తీసుకురావద్దు. లాక్ ద డోర్, తాళం మళ్ళీ 21 రోజులు తర్వాత తీయాలి. తాళం వేసిన 4 వ రోజు వరకు మీ కుటుంబం లో ఎవరికీ దగ్గు, జలుబు, జ్వరం లేకపోతే మీ కుటుంబం 50% సేఫ్.కరోనా చివరి పేషెంట్ ఐసొలేట్ అయిన తర్వాత 29 రోజుల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. అందరూ సహకరిస్తే నే తొందరగా దేశంలో నార్మల్ లైఫ్ వస్తుంది. సగటున కరోనా ఎటాక్ అయిన 4వ రోజు జ్వరం, 7వ రోజు ఊపిరితిత్తుల ఫెయిల్ తో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.వెంటనే వెంటిలేటర్స్ పెట్టకపోతే రక్తం లో ఆక్సిజన్ అందక యాంటీబాడీస్ పెరిగి 10వ రోజుకల్లా కిడ్నీ లు ఫెయిల్ అవుతాయి. అలా మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ తో అనాధ చావు చనిపోతారు. మన రాష్ట్రంలో 350 ,పంజాబ్ లో 290, డిల్లీలో 800 మాత్రమే వెంటిలేటర్స్ ఉన్నాయి.దేశంలో ఎన్ని ఉంటాయో అంచనా వేయండని ఆయన చూచించారు.