YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

10 నెలల చిన్నారికి కరోనా

10 నెలల చిన్నారికి కరోనా

10 నెలల చిన్నారికి కరోనా
బెంగళూర్, మార్చి 27
కర్ణాటకలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ఏడు కోవిడ్ కేసులను గుర్తించడంతో.. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 62కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో పది నెలల పసికందు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ బాబు తల్లిదండ్రులది దక్షిణ కన్నడ జిల్లా కాగా.. వారెవరూ విదేశాలకు వెళ్లి రాలేదు. కానీ ఇటీవలే ఆ కుటుంబం కేరళ వెళ్లి వచ్చిందని సమాచారం. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేపడున్నామని తెలిపిన అధికారులు... కాంటాక్ట్ అయిన ఆరుగుర్ని క్వారంటైన్‌కు తరలించారు.కొలంబో వెళ్లి మార్చి 15న బెంగళూరు తిరిగొచ్చిన 20 ఏళ్ల యువకుడికి కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అతడికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు. లండన్ నుంచి మార్చి 18న బెంగళూరు తిరిగొచ్చిన 25 ఏళ్ల యువతికి కూడా కరోనా సోకినట్లు తేలింది. కరోనా పేషెంట్ ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళకు కూడా కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో వీరిద్దర్నీ ఐసోలేషన్‌కు తరలించారు.దుబాయ్‌కు వెళ్లి వచ్చిన ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా సోకగా.. తుమకూరు జిల్లాకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 13న ఆయన ఢిల్లీ నుంచి రైలు ద్వారా కర్ణాటక వచ్చాడు. అతడికి కలిసిన 24 మంది వివరాలను సేకరించిన పోలీసులు 13 మందిని హాస్పిటల్‌లో ఐసోలేషన్లో ఉంచారు. దీంతో కర్ణాటకలో కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. గుల్బార్గా జిల్లాకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ బారిన పడి చనిపోగా.. చిక్కమంగళూరుకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కూడా కోవిడ్ కారణంగా చనిపోయింది. ఈమె స్వస్థలం అనంతపురం జిల్లా హిందూపురం.

Related Posts