YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 ఎక్కడికక్కడే బంద్...

 ఎక్కడికక్కడే బంద్...

 ఎక్కడికక్కడే బంద్...
విజయనగరం, మార్చి 28
కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజక వర్గాల్లోనూ ఎక్కడికక్కడ లాక్‌ డౌన్, 144 సెక్షన్లు పటిష్టంగా అమలవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో నూ  ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అనేక చర్యలు తీసుకుంటున్నారు. జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు వంటివి కొనుగోలు చేసుకునేందుకు నిర్ణీత సమయాల్లోనే అనుమతిస్తున్నారు. నిర్ధిష్ట దూ రాన్ని పాటిస్తూ ప్రజలు ఆయా సమయాల్లో బయటకు వస్తున్నారు. మిగతా సమయమంతా ఇంటికే పరిమితమవుతున్నారు. గిరిజన గ్రామాలతో పాటు జిల్లాలోని అనేక గ్రామాలకు దారులను మూసేశారు. బయటివారినెవ్వరినీ గ్రామాల్లోకి రానివ్వడం లేదు. ఆశ వర్కర్లు, వలంటీర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చినవారు, కరోనా లక్షణా లున్న వ్యక్తులెవరైనా ఉన్నారేమోనని ఆరాతీస్తున్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నిత్యం అధికారులతో మాట్లాడుతున్నారు. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.ప్రజల్లో చైతన్యం క్రమక్రమంగా పెరుగుతోంది. నిత్యావసర సరకుల కోసం కేటాయించిన సడలింపు సమయంలో పరిమితంగా రోడ్లపైకి వస్తూ ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలను పాటిస్తున్నారు.  విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించడంతో పాటు ముఖానికి మాస్క్‌లు ధరించి వైరస్‌ వ్యాప్తిని నివారించే దిశగా కనిపించారు. జిల్లాలోని రైతుబజా ర్లను మూసేసి, విశాలమైన మైదానాల్లో దూరదూరంగా దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు మార్కింగ్‌ చేసి కొనుగోలు దారులు నిలబడేలా చేస్తున్న చర్య లు సత్ఫలితాలనిచ్చాయి. కొత్తవలస. జామి, పూస పాటిరేగ, భోగాపురం, కరుపాం, సాలూరు పట్టణం, ఇతర మండల కేంద్రాల్లోని కూరగాయల దుకాణాలను విశాలమైన ప్రాంతాలకు మార్చారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇతరులు రావొద్దంటూ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చీపురుపల్లిలో అయిదు విద్యాసంస్థలను గుర్తించారు. ఆ భవనాల్లో వంద బెడ్లు, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ సమీపంలోని ఎస్సీ కాలేజ్‌ హాస్టల్‌లో వంద పడకల క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పా టు చేసేందుకు నిర్ణయించారు. పార్వతీపురం, సాలూ రు, విజయనగరంలోనూ క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటును ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. శృంగవరపుకోటలో దినసరి కూలీలకు ప్రత్యేకంగా భోజ నం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కడుబండి శ్రీని వాసరావు, అక్కడి పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు.
 

Related Posts