YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ దేశీయం విదేశీయం

కొత్త దందాకు తెర తీసిన సైబర్ నేరగాళ్లు

కొత్త దందాకు తెర తీసిన సైబర్ నేరగాళ్లు

కొత్త దందాకు తెర తీసిన సైబర్ నేరగాళ్లు
హైద్రాబాద్, మార్చి 28
కరోనా వైరస్ విజృంభణతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెర తీశారు. వైరస్‌ భయాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇటీవలే ఓ డాక్టర్‌ను దోచుకున్న ఘటన వెలుగు చూసింది. మాస్కులకు డిమాండ్ బాగా పెరగడంతో హైదరాబాద్‌లోని చార్మినార్‌కు చెందిన ప్రముఖ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ షేక్‌ సమద్‌ అబ్దుల్‌.. ఆన్‌లైన్‌ ద్వారా వాటిని కొనుగోలు చేయాలని భావించారు. చైనాకు చెందిన అలీబాబా వెబ్‌సైట్‌లో వెతికారు. వెతుకుతుండగానే నిమిషాల వ్యవధిలో డాక్టర్‌‌కు ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తాను అలీబాబా వెబ్‌సైట్‌ ద్వారా మాస్కులు విక్రయిస్తుంటానని చెప్పి డాక్టర్‌ను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన డాక్టర్‌ అబ్దుల్‌ తనకు 50 పెట్టెల నిండా మాస్కులు అవసరం ఉందని, వెంటనే పంపాల్సిందిగా కోరారు. దీంతో అవతలి వ్యక్తి ఇందుకు మొత్తం రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ముందుగా 30 శాతం అడ్వాన్స్‌ చెల్లించాలని ఆగంతుకుడు చెప్పాడు.ఫలితంగా అతణ్ని నమ్మిన డాక్టర్ ఫోన్లో చెప్పిన వివరాల ప్రకారం.. బ్యాంకు ఖాతాకు వైద్యుడు రూ.4.11 లక్షలను రెండు సార్లు విడివిడిగా పంపించాడు. ఇక అంతే.. ఆ ర్డర్ సంగతి ఏమైందని మళ్లీ ఫోన్ చేయగా.. ఆ ఫోన్ నెంబరు స్విచ్చాఫ్‌ వస్తోంది. దీంతో మోసపోయినట్లుగా తెలుసుకున్న డాక్టర్‌ హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్నారు.

Related Posts