YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

కరోనా సోకితే మరణశిక్షే

కరోనా సోకితే మరణశిక్షే

కరోనా సోకితే మరణశిక్షే
ప్యొం గ్యాంగ్, మార్చి 28
కరోనా వైరస్ సోకి ప్రపంచమంతా ఒకవైపు వణికిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా సయితం చేతులెత్తే పరిస్థితికి వచ్చింది. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలే కరోనా ధాటికి విలవిలలాడిపోతున్నాయి. అయితే ఉత్తర కొరియాలో మాత్రం కరోనా వ్యాధి సోకితే కాల్చి పారేయమని ఉత్తర్వులు జారీ చేశాడట ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. కిమ్ సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నిర్దయగా అనేక మంది ఊచకోత కోసిన ఘన చరిత్ర కిమ్ ది.అంతేకాదు అణ్యాయుధాలు తయారు చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేసే శైలి కిమ్ కు ఉంది. ఇందుకు అనేక ఉదాహరణలు గతంలో అనేక సార్లు చూశాం. ఇప్పుడు కూడా కిమ్ తమ దేశంలో కరోనా వైరస్ లేనే లేదని బుకాయిస్తున్నారు. తమ దేశంలో కరోనా వైరస్ ప్రవేశించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించుకున్నారు. కానీ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కరోనా వైరస్ సోకి అక్కడ సైనికులు కొందరు మృతి చెందారని తెలుస్తోంది.మరోవైపు కిమ్ తమ దేశ సరిహద్దులను మూసి వేశారు. ఇళ్లను వదిలి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇవి ప్రతి దేశం అనుసరిస్తున్న విధానమే. అయితే కిమ్ మరింత కిరాతకంగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే కాల్చి చంపేయండని అధికారులకు ఉత్తర్వులు ఇచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చినా కాల్చి చంపేయమని ఉత్తర్వులు జారీ చేశాడట. ఈ కిరాతకుడు కరోనా వైరస్ లేదంటూనే మరో వైపు ఇతర దేశాల వైపు సాయం కోసం చూస్తున్నాడు.కరోనా వైరస్ పరీక్షలు, మాస్క్ లు, ఇతర వైద్య పరికరాల కోసం పొరుగు దేశాల మీద కిమ్ ఆధారపడుతున్నారు. ఇప్పటికే వీటికోసం దక్షిణ కొరియాను కిమ్ సంప్రదించినట్లు ప్రచారం ఉంది. ఉత్తర కొరియాలో ఉన్న విదేశీయులను నిర్భంధంలోకి తీసుకోవడమే కాకుండా ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదన్న వార్తలు వస్తున్నాయి. కిమ్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి కావవడంతో ఉత్తర కొరియాలో ఖర్మ కాలి కరోనా సోకితే వారికి మరణం గ్యారంటీ అని తెలియడంతో అంతర్జాతీయ సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది

Related Posts