YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దు: సీఎం

పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దు: సీఎం

పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దు: సీఎం
హైదరాబాద్ మార్చ్ 28
'దేవుడి దయవల్ల ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయి. నేరుగా గానీ, ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో గానీ పంటలకు నీళ్లు అందుతాయి. పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దు. ' అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌పై ఉన్నతాధికారులతో సమావేశం  అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.వ్యవసాయ అధికారులు గ్రామాల్లోనే పంటలు కొనుగోలు చేస్తారు. విపత్కర పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వానికి సహకరించాలి. గోదాములు సరిపోకపోతే పాఠశాలలు, విద్యా సంస్థలను ఉపయోగిస్తాం. పంట కొనుగోలు చేసే వ్యాపారులు రైతుకు ఎంఎస్‌పీ చెల్లించాలి. జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగంతో ఎల్లుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తాం. 50 లక్షలకు పైగా ఎకరాల్లో పంట చేతికొచ్చే సమయమిది. ప్రాజెక్టుల కింద ఏప్రిల్‌ 10 వరకు నీటి సరఫరా చేయాలని ఆదేశాలిచ్చాం. బావులు, బోర్లపై ఆధారపడ్డ రైతులకు విద్యుత్‌ సమస్యలు లేకుండా చూస్తాం. నిత్యావసరాలు, కూరగాయల కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లాలి. రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పంట కొనుగోలు సొమ్మును చెక్కు రూపంలో రైతుకు అందిస్తాం. ఐకేపీ సెంటర్ల మాదిరిగా తొందరగా కొనుగోళ్లు జరగవు. ధాన్యం కొనుగోలు సెంటర్‌కు గుంపులు గుంపులుగా రావొద్దు. ధాన్యం కొనుగోలుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సహకరించాలి. రైతులను మార్కెట్‌ యార్డులకు రానివ్వరు. అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Related Posts