ఇటలీ, స్పెయిన్, అమెరికాల్లో కరోనా మరణ మృదంగం
న్యూ ఢిల్లీ మార్చ్ 28
ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలకు కరోనా వైరస్ పాకింది. మొత్తం ఇప్పటి వరకు ఐదున్నర లక్షలకు కరోనా బాధితులు సంఖ్య చేరింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకు 24 వేల 867 మందిని బలితీసుకుంది. ఐరోపా ఖండంలోనే 15వేల మరణాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఒక్క రోజే స్పెయిన్‌లో 689, ఇరాన్‌లో 144 మంది మృతిచెందారు. ఇటలీలో మృతుల సంఖ్య 8వేలు దాటింది. అటు ప్రపంచంలోనే ఎక్కువ కేసులు నమోదన దేశంగా అమెరికా నిలిచింది. అక్కడ రోజురోజుకు కరోనా బాధితులు వేలల్లో పెరుగుతున్నారు. నిన్ని ఒక్క రోజే 17వేల మందికి వైరస్ సోకింది. ఇప్పటికే అమెరికాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 85వేలు దాటింది. గురువారం ఒక్‌ురోజే అమెరికాలో 269 మంది కరోనాతో చనిపోయారు. అటు స్పెయిన్‌లో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇవాళ ఒక్కరోజే 769మంది మృత్యువాత పడ్డారు. 5వేల వరకు కొత్త కేసులు నమోదయ్యాయి. అటు జర్మనిలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.