YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

శుక్రవారం ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు: సీఎం ఆందోళన

శుక్రవారం ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు: సీఎం ఆందోళన

శుక్రవారం ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు: సీఎం ఆందోళన
హైదరాబాద్‌ మార్చ్ 28
కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59కి చేరిందని తెలిపారు. ఇవాళ ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు. మరో 20 వేల మంది హోం క్వారంటైన్‌ కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల్లో అధికారులు, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సీఎం చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డాక్టర్లు, ఇతర ఇబ్బందితో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నాం. ఐసోలేషన్‌ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందించగలం. 1400 ఐసీయూ బెడ్స్‌ అందుబాటులో ఉంచాం. 500 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చాం..అవి వస్తున్నాయి. 12400 ఇన్‌పేషంట్స్‌కు సేవలందించేందుకు బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. 60వేల మంది వ్యాధికి గురైనా చికిత్స అందించే ఏర్పాట్లు చేశాం. 11వేల మంది విశ్రాంత వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సేవలు వాడుకునేలా చర్యలు తీసుకున్నాం. పోలీసులు, ప్రభుత్వ, వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలి.  ప్రజల అలసత్వం సరికాదు, బాధలైనా భరించాలి. ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Related Posts