నవోదయ పరీక్షలు వాయిదా
హైదరాబాద్ మార్చ్ 28
దేశంలోని జవహర్ నవోదయ విద్యాలయలలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 11న జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల జెఎన్‌విఎస్‌టి 6 వ తరగతి ప్రవేశ ఎంపిక పరీక్ష వాయిదా పడింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనే విషయం తర్వలో ప్రకటిస్తామని ఎన్‌వీఎస్ ప్రకటించింది. జవహర్ నవోదయాలలో ప్రవేశాల కోసం ఏటా రెండుసార్లు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మొదటి దశకు జెఎన్‌వి క్లాస్ 6 ప్రవేశ ప్రవేశ పరీక్షను జనవరి 11 న నిర్వహించారు. దాని ఫలితాలను ఇప్పటికే సమితి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. రెండవ దశ జెఎన్‌వి క్లాస్ 6 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 11 న జరగాల్సి ఉంది. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం పరీక్ష వాయిదా పడింది.