ఆజంజాహి మిల్ గ్రౌండ్ లో కూరగాయల మార్కెట్
వరంగల్ మార్చి 28
జిల్లా ప్రజలకు పెద్దదిక్కైన కూరగాయల మార్కెట్ ను తాత్కాలికంగా ఆజంజాహి మిల్ గ్రౌండ్ కు తరలించే చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చెప్పారు. శుక్రవారం కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతు, బల్దియా కమీషనర్ పమేల సత్పతితో కలిసి ఆజంజాహి మిల్ గ్రౌండ్ ను సందర్శించి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ చర్యల్లో బాగంగా సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు ఇప్పుడున్న కూరగాయల మార్కెట్ ఇరుకుగా ఉందని అందువల్ల వైరస్ ప్రభలే అవకాశం ఉన్నందున 32 ఎకరాల విస్థీర్ణం గల ఆజంజాహి మిల్ గ్రౌండ్ కు మార్కెట్ ను తాత్కాలికంగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మార్కెట్ ను మిల్ గ్రౌండ్ కు తరలించి బారికేడింగ్ ఏర్పాటు చేసి ప్రజలంతా సామాజిక దూరం పాటించేందుకు వీలుగా మార్కింగ్ చేయాలని ఆర్ అండ్ బి, మార్కెటింగ్, రెవెన్యూ, మున్సిపల్ అదికారులకు అదేశాలు జారీ చేసారు. ప్రజలు ఒకచోట గుమికూడకుండా సామాజిక దూరం పాటించి నిత్యవసరాల సరుకులు కొనుక్కోవాలని సూచించారు. రెండు రోజుల్లో మార్కెట్ తరలింపు పనులు పూర్తవుతాయని ప్రజలు భాద్యతతో వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమేయడంలో సహకరించాలని కోరారు. అనంతరం మార్కెట్ పరిసరాల్లో ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బంది ఆద్వర్యంలో సోడియం హైపో క్లోరిడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. అత్యవసరం అయితే తప్ప భయటకు రావొద్దని తెలిపిన ఆయన
మన ఆరోగ్యం, మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయని, బాద్యతగా వ్యవహరించి పరిశుభ్రత పాటిస్తే కరోనా ను నివారించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటుందని, అందుకు ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విజ్ఞప్తి చేశారు.