YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం విదేశీయం

కరోనా విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన చైనా... వాస్తవాలు దాచిపెట్టి ప్రపంచాన్ని బలితీసుకుంటుంది 

కరోనా విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన చైనా... వాస్తవాలు దాచిపెట్టి ప్రపంచాన్ని బలితీసుకుంటుంది 

కరోనా విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన చైనా... వాస్తవాలు దాచిపెట్టి ప్రపంచాన్ని బలితీసుకుంటుంది 
వుహాన్‌లోని ఫిష్ మార్కెట్  పనిచేసే ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు తొలిసారి డిసెంబరు 1నే గుర్తించారు. అతడినుండి వైరస్ లక్షణాలు  భార్య కూడా అనారోగ్యానికి గురయ్యింది. వీరిలో న్యుమోనియా లక్షణాలు బయటపడటంతో హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. కొత్తరకం వైరస్ వీరికి సోకినట్టు గుర్తించిన వుహాన్ వైద్యులు.. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించినట్టు నిర్ధారించారు. అయితే, ఈ విషయం చైనా  ప్రపంచానికి చైనా తెలియజేయడంలో ఆలస్యం చేసింది . డిసెంబరు 25న వుహాన్‌లోని రెండు హాస్పిటల్స్‌లోని వైద్య సిబ్బందిలో న్యుమోనియా లక్షణాలు బయటపడటంతో వారిని క్యారంటైన్‌లో ఉంచారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అనూహ్యంగా వేలాది మంది అనారోగ్యంతో హాస్పిటల్స్‌లో చేరారు.. కానీ, అప్పుడు కూడా చైనా దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఏడు కేసులను పరిశీలించిన డాక్టర్ లీ వెన్‌లీయాంగ్ ఇది 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వైరస్‌‌గా భావించారు. డిసెంబర్ 30న చాటింగ్ ద్వారా  తన సహచర డాక్టర్లను లీ హెచ్చరించారు. ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పుడు ఇది కరోనా వైరస్ అని ఆయనకు తెలీదు. జనవరి 3న చైనా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు లీని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని హెచ్చరించారు . ఈ విషయం బయటకి చెప్పానని అతనితో  సంతకం చేయించుకున్నారు. అంతేకాదు, అంతుచిక్కని ఈ వైరస్ గురించి ఎలాంటి సమాచారం వెల్లడించరాదని హాస్పిటల్స్‌కు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ఆదేశాలు జారీచేసింది.

Related Posts